సంచలనంగా మారిన ఆట మొదటి సీజన్ విన్నర్ టీనా మరణం..

సంచలనంగా మారిన ఆట మొదటి సీజన్ విన్నర్ టీనా మరణం..


- కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న టీనా.. 
- గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివాసం.. 
- ఎక్కువగా మద్యం సేవించడం వల్లే చనిపోయిందా..?

హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :  
డ్యాన్స్‌ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్‌ విన్నర్‌ టీనా సాధు మరణం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చిన్నవయసులోనే టీనా మరణించడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆట మొదటి సీజన్‌కు విన్నర్‌గా నిలిచిన ఆమె ఆ షో నాలుగో సీజన్‌కు జడ్జిగానూ వ్యవహరించారు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివసిస్తోంది. అయితే నాలుగైదు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన టీనా యాంకర్‌ శిల్పాచక్రవర్తిని కలిసిందని, తిరిగి డ్యాన్స్‌ షోల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని మనసులోని మాట బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గోవా వెళ్లిపోయిన ఆమె ఇంట్లో ఉన్న సమయంలో మద్యం సేవించిందని, అయితే ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబీకులు తెలుపుతున్నట్లుగా ఓ వార్త వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇక టీనా సోషల్‌ మీడియాలో చివరిసారిగా షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Tags :