ఏప్రిల్ 17 నుంచి అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు...

హయత్నగర్, 14 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 17న మొదలవుతాయని హయత్నగర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి 23 వరకు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు, మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి 13 వరకు జరుగుతాయని వెల్లడించారు. మార్చి 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. ఇతర వివరాల కోసం 73829 29771 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Tags :