ఏసీబీకి చిక్కిన ఎస్ఐ లవకుమార్

ఏసీబీకి చిక్కిన ఎస్ఐ లవకుమార్

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్. ఐగా విధులు నిర్వహిస్తోన్న లవకుమార్ బుధవారం రాత్రి జిల్లా. యస్.పి కార్యాలయానికి బదిలీ. లవకుమార్ నేడు జిల్లా కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ గురువారం మధ్యాహ్నమే ఏసీబీ అధికారులకు చిక్కాడు. సూర్యాపేట మండల పరిధిలోని, రాజుగారి తోట హోటల్ యాజమాన్యం నుంచి రూ. 1.30 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలంటేనే లంచం లేనిదే ఏ పనీ కాదన్న స్థాయికి వచ్చేశాయి పరిస్థితులు. పని జరగాలంటే ఎంతో కొంత ముట్టజెప్పుకోవాల్సిందే. సీటులో కూర్చున్నంత వరకే అన్నట్టు అధికారులు కూడా అందినకాడికి దండుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. సీటులో నుంచి బదిలీ అయ్యేలోపు జేబులు నింపుకోవాలనుకున్నాడో ఏమో ఈరోజు బదిలీ అయిపోవాల్సి ఉండగా.. చివరి రోజును కూడా వదలకుండా లంచం వసూలు చేస్తూ అడ్డంగా ఏసీబీకి చిక్కాడు. బదిలీపై వెళ్లే ముందు జేబులు నింపుకునేందుకు సిద్ధపడ్డాడు. రాజుగారి తోట హోటల్ యజమానిని భారీగా లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని | హోటల్ యజమాని నేరుగా ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సూచనలతో రూ.1.30 లక్షలు లంచం ఇస్తుండగా ఎస్సై లవకుమార్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Tags :