ఏసీబీ కి చిక్కిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ రెడ్డి..

ఏసీబీ కి చిక్కిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ రెడ్డి..

హైదరాబాద్, 10 మార్చి ( ఆదాబ్ హైదరాబాద్ ) : మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, వల్లభ్ నగర్, బేగంపేటలోని ఎస్.ఆర్.ఓ. కార్యాలయ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కాడు..  ఫిర్యాదుదారుడు  తాటికొండ రాజు, దగ్గర నుండి రూ.15,000/- లంచం మొత్తాన్ని డిమాండ్ చేశాడు.. రాజు ఫిర్యాదును స్వీకరించిన అధికారులు సదరు మధు సూధన్ రెడ్డి లంచం తీసుకుంటుండగా దాడి చేసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అల్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అనుబంధం-1బి ఫారమ్‌ను పూరించడం కోసం, ఫిర్యాదుదారు యొక్క ఆస్తికి సంబంధించిన పత్రం యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం కోసం  రూ.15,000/- లంచాన్ని తీసుకున్నట్టు అధికారులు తెలిపారు..  ఆ పూర్తి మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని, విచారణ చేబట్టారు..

Tags :