బృహద్ధమని” (అయోర్టా) విచ్ఛిన్నం అయిన పేషెంట్ కు అత్యాధునిక గుండె సర్జరీతో సరికొత్త జీవితాన్నిచ్చిన యశోద హాస్పిటల్స్ వైద్యులు..

బృహద్ధమని” (అయోర్టా) విచ్ఛిన్నం అయిన పేషెంట్ కు అత్యాధునిక    గుండె సర్జరీతో సరికొత్త జీవితాన్నిచ్చిన యశోద హాస్పిటల్స్ వైద్యులు..


- సిద్దిపేట జిల్లా, నంగనూర్‌కు  చెందిన కనకయ్యకు అయోర్టా వాల్వ్ ను 
   విజయవంతంగా అమర్చిన - యశోద హాస్పిటల్స్ 


హైదరాబాద్, 13 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
మన శరీరంలో గుండె చాలా ప్రధాన అవయవం. ఇది పూర్తిగా కండరాలతో నిర్మితమైనది నిరంతరాయంగా మనిషి జీవించినంతకాలం గుండె పనిచేస్తూనే ఉండాలి. మన జీవితకాలంలో గుండె మొత్తం మీద 8 లక్షల పైగా లీటర్ల రక్తాన్ని శరీరంలోని అన్ని ప్రధాన భాగాలకు పంప్ చేస్తుంది. గుండె నుండి అవయవాలు అన్నింటికీ రక్తన్ని చేర్చే బాధ్యతను శరీరంలో అతిపెద్దది అయిన బృహద్ధమని (అయోర్టా) నిర్వహిస్తుంది. పని ఒత్తిడిని తట్టుకొని గుండె నుండి శుద్ద రక్తం తల పైభాగం మొదలుకొని అరికాళ్ళ వరకూ ప్రతి భాగానికీ చేరేటట్లు చూస్తుంది. ఈ అయోర్టా వాల్వ్ తో పాటు గుండెలో 4 కవాటాలు (వాల్వ్) ఉంటాయి. “రక్త ప్రసరణ సరఫరా వ్యవస్థ” కు ఇవి చాలా కీలకం. ఇంతటి ప్రదానమైన బృహద్ధమని లోపలి, మధ్య పొరలు చీలిపోవడం అనే అరుదైన సమస్యతో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన సిద్దిపేట జిల్లాకు చెందిన కనకయ్యకు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన సందర్బంగా యశోద హాస్పిటల్స్ (సికింద్రాబాద్) కు చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్. జి. రమేష్, తన అనుభవాలను తెలియజేసారు.                                                                                                                                                     

ఈ సందర్బంగా డాక్టర్. జి. రమేష్ మాట్లాడుతూ... సిద్దిపేట జిల్లా, నంగనూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడైన 53 సంవత్సరాల కనకయ్య, గత నెల ఒక అరుదైన గుండె ప్రోబ్లెంతో ప్రాణాపాయ స్థితిలో మా దగ్గరకు రావడం జరిగింది. ఇతనికి చాలా అరుదుగా వచ్చే గుండె నుండి రక్తన్ని తీసుకెళ్ళే అయోర్టా (బృహద్ధమని విచ్ఛిన్నం) బృహద్ధమని లోపలి మరియు మధ్య పొరలు చీలిపోవడం అనే ఒక అరుదైన గుండె సమస్యతో అకస్మాత్తుగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడుతూ ప్రాణాపాయ స్థితిలో మదగ్గరకు వచ్చిన కనకయ్యను అత్యాధునిక “క్యాథ్ ల్యాబ్” కు తరలించి, మరిన్ని పరిక్షలు చేసి అతను అయోర్టా (బృహద్ధమని విచ్ఛిన్నం)తో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగింది. దీనికి “బెంటాల్ ప్రక్రియ” అనే అత్యాధునిక సర్జరీనే సరైన పరిష్కారమని కనకయ్య కుటుంబ సబ్యులకు వివరించి, వారిఆమోదంతో సర్జరీ ప్రారంభించడం జరిగింది. బెంటాల్ ప్రక్రియ అనేది బృహద్ధమని కవాటం, బృహద్ధమని రూట్ మరియు ఆరోహణ బృహద్ధమని యొక్క మిశ్రమ గ్రాఫ్ట్ రీప్లేస్‌మెంట్‌తో కూడిన ఒక రకమైన కార్డియాక్ సర్జరీ, ఇది కరోనరీ ఆర్టరీలను గ్రాఫ్ట్‌లోకి తిరిగి అమర్చడం.  డాక్టర్. జి. రమేష్, డాక్టర్. పి. వి. నరేష్ కుమార్ మరియు కార్డియాలజీ వైద్య బృందం కలిసి చేసిన సర్జరీ తరువాత కనకయ్య గుండె బృహద్ధమని కవాటం, గ్రాఫ్ట్ విజయవంతంగా  రీప్లేస్‌మెంట్‌ చేయడం జరిగిందని, సర్జరీ తరువాత కనకయ్య చాలా తక్కువ టైంలో కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగలిగామని యశోద హాస్పిటల్స్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్. జి. రమేష్, తెలియజేసారు.

Tags :