ఆజ్ కి బాత్...

ఆజ్ కి బాత్...

కూలినాలి జేసుకొని కైకిలు దీసుకొని..  
కమ్మగా వండుకొని తిందామంటే..!
వండిన కూర కమ్మగా వున్నదే గాని..  
దాంట్లో పోసిన నూనె రేటే ఘాటుగా వున్నదే.. !
పాడుబడ్డ నోటికి గోలిచ్చిన కూరలెక్కడివి..  
తాలింపు లేక నోటి రుచికి తాళాలేస్తిరి!
పైకమున్నొడే పసందైన పల్లి నూనె దీనవట్టె!
ఏ దిక్కులు మొక్కిన పొద్దు తిరుగుడు 
నూనె తినే భాగ్యమెక్కడిదిరా!
పామాయిల్ నూనెకి కూడా దూరం జేసిన 
పాలకులారా! ఇదేమి పాలనా!
మంచినూనె ధరలే  జెపుతున్నవి 
మీ మోతేవారి పాలనేందో!!

   - ముచ్కుర్ సుమన్ గౌడ్..

Tags :