ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..

మతం ముసుగు తొలగించు.. 
మనిషన్నవాడు కనిపిస్తాడు.. 
కుళ్ళు, కుతంత్రం తీసేసేయ్.. 
మానవత్వం దర్శనమిస్తుంది.. 
పేదా, గొప్ప తేడాలు వదిలేయ్.. 
ఎదుటివారిలో నువ్వు కనిపిస్తావ్.. 
ఆప్యాయతను అరువుతెచ్చుకో.. 
అనురాగం నిన్ను హత్తుకుంటుంది.. 
ధర్మాన్ని ఆచరించు చూడు.. 
ఈ లోకమే నీకు దాసోహం అవుతుంది.. 
మనిషిగా బ్రతికి చూడు..
స్వర్గం నీ కళ్లముందుంటుంది..

Tags :