105 సీట్లు వచ్చే నమ్మకం ఉంటే...

105 సీట్లు వచ్చే నమ్మకం ఉంటే...

వచ్చే ఎన్నికల్లో 105 సీట్లు సాధిస్తామని చెబుతున్నా కేసీఆర్... పీకేను ఎందుకు తెచ్చుకున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పీకేని పిలిపించుకున్నారని ఆరోపించారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమంటూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రూ.20 వేల కోట్లు ఖర్చుపెడితే రాష్ట్రం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయవచ్చని, కానీ ఈ విషయంలో కేసీఆర్ డ్రామా ఆడుతున్నారన్నారు. మూసీ నది కలుషితమై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నమామి గంగా పేరుతో గంగా నది ప్రక్షాళనకు కేంద్రం రూ.30 వేల కోట్లు కేటాయించిందని, మూసీ నదికి కనీసం రూ.3 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Tags :